eResources

Select any of the filter or use search bar to find eResources

Maths Activity 031

This program presents the activity to make and explore various geometrical figures through paper folding.

Sound Pollution

ఈ అనిమేటెడ్ వీడియో కార్యక్రమం ధ్వని కాలుష్యం గూర్చి వివరిస్తుంది. ధ్వని కాలుష్యం గల కారణాలు, మానవుని ఆరోగ్యం పై దాని ప్రభావం తెలుసుకుంటాము.

Laser Part-2

ఈ వీడియో కార్యక్రమం లేజర్ కిరణాలు రెండవ భాగాన్ని గూర్చివివరిస్తుంది. లేజర్ కిరణాల లక్షణాలు, ఈ కిరణాల యొక్క ధర్మాలు శోషణం,స్వచ్చంద ఉద్గారం,జనాభా విలోమం మరియు ఈ కిరణాల పనిచేయు విధానంలో అనుసరించవలసిన నియమాలను గూర్చితెలుసుకుంటాం.

Laser Part-1

ఈ వీడియో కార్యక్రమం లేజర్ కిరణాలను గూర్చివివరిస్తుంది.లేజర్ కిరణాలను "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" అని నిర్వచిస్తారు.ఇందులో లేజర్ కిరణాల ప్రాముఖ్యత తెలుసుకుంటాం.ఆరోగ్య,పారిశ్రామిక,రక్షణ,అంతరిక్ష,వినోద,సాంకేతిక రంగాలలో వాటి ఉపయోగాలు మరియు లేజర్ కిరణాల లక్షణాలు తెలుసుకుంటాం.

Chakradhari

ఈ అనిమేటెడ్ వీడియో కార్యక్రమం పంచతంత్ర కథలలో ఒకటి. ఈ కథలోని నీతి ఏమంటే అత్యాశ మనిషికి పనికి రాదు. ఈ ప్రపంచంలో అత్యాశపరుడి తలమీద చక్రం నిరంతరం తిరుగుతూవుంటుంది.అంటే చక్రధారి యై వుంటాడు.

Perimeter

ఈ వీడీయో కార్యక్రమం ద్వారా పిల్లలు వస్తువుల చుట్టు కొలతలు ఎలా కనుక్కోవాలో ఒక కృత్యం ద్వారా నేర్చుకొంటారు.ఈ కృత్యం లో పిల్లలకు ఒక వస్తువునిచ్చి దాని చుట్టుకొలత కొలవమని టీచర్ అడుగుతాడు.దీని ద్వారా పిల్లలు చుట్టు కొలత యొక్క భావాన్ని అర్ధం చేసుకొంటారు.ఈ కృత్యం లో పూర్తి గా పాల్గొంటారు.

Sympathy

ఈ వీడియో కార్యక్రమం పిల్లవాడు జంతువులపట్ల చూపే సానుభూతి ని గూర్చి తెలియజేస్తుంది.పిల్లలలో దయ, సానుభూతి అనే గుణాలుంటాయి.ఇందులో పిల్లవాడు లేగదూడ పాలు త్రాగకుండా తల్లితనకు ఇవ్వడం,ముసలి ఎద్దు ను కటికవాళ్లకు వాళ్ల నాన్న అమ్మే ప్రయత్నం చేయడం,కోడిపందాలకోసము కోళ్లను మేపడం,ఇంటిలో పిఛుక గూళ్లను తొలగించడం చూసి బాధ పడి,అడ్డుకుంటాడు.ఎద్ద్దు ను ఆసుపత్రి లో డాక్టర్ తో వైద్యం చేయిస్తాడు.మూగ జీవుల పట్ల దయ, కరుణ వుండాలని తల్లి తంద్రులకు చెబుతాడు.ఇటువంటి గుణాలు పిల్లల్లో మానవీయ కోణాన్ని చూపుతాయి.

A Little Light in the Dark

విత్తనము సరియైన ప్రదేశము లో పడితేనే మొలకెత్తుతు౦ది.అదే విధంగా పిల్లలకు ప్రేమ,అనురాగం పంచినట్లైతేనే సరియైన పౌరులుగా ఎదుగుతారు అన్నది ఈ చిత్రం లోని సారాంశం. సవతి తల్లి వత్తిడి వల్ల పిల్లవాడు ఇల్లు వదలి పారిపోతాడు.ముఠా మేస్త్రి వలలో పడతాడు.అక్కడ ముఠా మేస్త్రి హింసలు భరించలేక చివరికి ఒక వ్యక్తి ద్వారా అనాధ శరణాలయంలో చేరి అక్కడ బట్టలు కుట్టే పని నేర్చుకొని, చివరికి ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకు చొక్కా కుట్టి పంపిస్తాడు.అంతేగాక ముఠా మేస్త్రి ని పోలీసులకు పట్టించి చివరకు తన మిత్రులందరిని కాపాడి వారిని కూడా అనాధ శరణాలయంలో చేర్పిస్తాడు.చీకట్లో చిరు కాంతిని నింపాడు.అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయత్నాన్ని విడువరాదు.సమాజంలో మంచి స్తానం కోసం శోధించి సాధించాలి.

Similarities between Human eye and Camera - Part - 2

ఈ వీడియో కార్యక్రమం కెమెరాకి మానవుని కన్నుకున్న పోలికలను వివరిస్తుంది. కెమెరాపెట్టె కనుగుడ్డుని, కెమెరా కటకం, కంటిలోని కటకాన్ని, కెమెరామూత కనురెప్పల్ని, విభాజకం తారకను, రంధ్రం తారకను,కెమెరా ఫిల్మ్ నేత్రపటలాన్ని పోలివుంటాయి. కంటిలో అన్నీ సహజంగా జరిగిపోతాయి. కెమెరాలోవున్న దూరాన్ని బట్టి కటకాన్ని మార్చుకోవాలి. కంటిలో కటకం సంకోచ వ్యాకోచాలతో సహజంగా జరిగిపోతుంది.

Similarities between Human Eye and Camera - Part- I

ఈ వీడియో కార్యక్రమం కన్ను కెమెరాలోని భాగాలను అవి నిర్వహించే పనులను వివరిస్తుంది. కంటిలో కనురెప్పలు , కనుగుడ్డు, బయటకు కనపడే భాగాలు. కంటిలోపల ధృఢస్తరం,రక్తపటలం,నేత్రపటలం,శుక్లపటలం, కటకం, కంటిపాప, అంధచుక్క ఉంటాయి. కంటిపొర, శుక్లపటలం, కనుపాప ద్వారా కంటిలోకిచేరిన కాంతి నాడీ ప్రచోదనాల రూపంలో, దృక్ నాడీ ద్వారా మెదడుకు చేరవేస్తుంది. కెమెరాలో పెట్టె దాని ముందు కటకం. కటకము రంధ్రం లోపల విభాజకం ఉంటాయి. తర్వాత కాంతిని క్రోడికరించి కాంతి కేంద్రీకృత సాధనం, తర్వాత ప్రతిబింబం ఏర్పడటానికి ఫిల్మ్ ఉంటాయి.

Won't you Love me?

ఈ వీడియో కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ గురించి తోలుబొమ్మలాట ద్వారా వివరిస్తుంది. ప్రపంచం అంతా తనదా అన్నట్లు చుస్తున్న మనిషి తన స్వార్ధం కోసం అడవిలో నివసించే ఏనుగు, పులి, లేడి, నెమలి, ఉడుతా, రామచిలుక, తాబేలు, కోతి లాంటి జంతువులకు నష్టం కలుగచేస్తున్నాడు. చెట్లను నరికి కాల్చి వాతావరణాన్ని కలుషితంచేస్తున్నాడు. తనతో పాటు జంతువులన్నింటిని బతకనివ్వాలని, వాటిని ప్రేమించాలని తెలుసుకోవాలి. వాతావరణాన్ని కాపాడుకొని రక్షించుకోవాలని గుర్తెరిగి ప్రవర్తించాలి.

Growth and Differentiation in Animals

ఈ వీడియో కార్యక్రమం జంతువులలో పెరుగుదల విభేదనాన్ని వివరిస్తుంది. జంతువులలో దేహం అంతటా నియమిత కాలం వరకు పెరుగుదల ఉంటుంది. సంయుక్త బీజం నుండి పిండం పెరుగునప్పుడు 3వ దశలో త్వచాలు ఏర్పడి వాటి నుండి శరీర భాగాలు ఏర్పడతాయి. జంతువు ఆకారం, పరిమాణాన్ని బట్టి పెరుగుదల విభేదనం ఉంటుంది. జంతువులలో పెరుగుదల విభేదనం లభ్యమయ్యే ఆహారం. హార్మోనుల స్రావం, వాతావరణ ఉష్ణోగ్రత, లభించే ఆక్సిజన్ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.